Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
జీపు బోల్తా.. ఇద్దరు మృతి..10 మందికి గాయాలు – K News

జీపు బోల్తా.. ఇద్దరు మృతి..10 మందికి గాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపు తప్పు జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గిరిజననులు అక్కడిక్కడే మృతి చెందారు. చింతపల్లి మండలం భీమనపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పదిమందికి పైగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలన్ని తెలుసుకున్నారు. అతివేగం వల్లే జీపు బోల్తా పడినట్లు గుర్తించారు. మృతులు, క్షగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

చనిపోయిన ఇద్దరు మృతదేహాలకు వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పది మందికి గాయాలయ్యాయని.. ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు అతివేగంగా నడపొద్దని సూచించారు. వాహన దారులు రోడ్డు రూల్స్ పాటించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.