Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
కాళేశ్వరంపై మాట్లాడుతుంటే ఉలికిపాటు ఎందుకు: మంత్రి శ్రీధర్ బాబు – K News

కాళేశ్వరంపై మాట్లాడుతుంటే ఉలికిపాటు ఎందుకు: మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అడ్డగోలు నిర్మాణంతోనే మేడిగడ్డలో రాష్ట్ర ప్రజల సంపద దుర్వినియోగమైందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.సంపద ఎలా దుర్వినియోగమైందో మేడిగడ్డ సందర్శనతోనే తెలుస్తుందన్నారు.

అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు తీసుకెళ్తున్నామని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు సహా ఇతర అనేక విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారని తెలిపారు.

కాళేశ్వరంపై మాట్లాడుతుంటే ఉలికిపాటు ఎందుకు: మంత్రి శ్రీధర్ బాబు

దీనిపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ పూర్తిస్థాయిలో అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చిందని అన్నారు. డ్యాం సేప్టీ విషయంలో తప్పిదాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం చెప్పారని పేర్కొన్నారు. మేడిగడ్డలో పిల్లర్లకు పగులు, కుంగిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన 40, 50 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులకు, డ్యాంలకు ఈ స్థాయిలో నష్టం జరగలేదని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎందుకు ఉలిక్కిపడుతుందని అన్నారు. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వాస్తవాలను తెలుసుకునేందుకే మేడిగడ్డ టూర్ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గం మంథని పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులు భూములు, ఇళ్లు ఇచ్చి త్యాగం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పగుళ్లకు కుంగిపోవడానికి కారణం ఎవరు అన్నారు. సభలో ఏ నిర్ణయాలు ఉంటాయో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లాకు తెలుసని అన్నారు. ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.