పిఆర్వోలు, ఉద్యోగులూ జర్నలిస్టులే ..?
ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బెనిఫిట్స్ హాంఫట్
జర్నలిస్టుల ముసుగులో కొందరు వీఐపీ పిఆర్వోలు (ఒకరిద్దరు), ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు చలామణి అవుతూ .. నిజమైన జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నారు. వారికి సంబంధిత అధికారులు వంతపాదుతున్నారు. ఓ జిల్లాలో డిపిఆర్వో గ్రూపులో జర్నలిస్టులతో పాటు వీరంతా చేరి జర్నలిస్టుల్లాగా చలామణి అవుతున్నారు. భార్యల పేరిట కొందరు.. ప్రభుత్వ అధికారులు మరి కొందరు…. విలేఖరులుగా అవతారం ఎత్తారు. ఒక పక్క నెల .. నెలా వేలు, లక్షల్లో జీతాలు తీసుకుంటూనే మరో పక్క ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ లాగేసుకుంటున్నారు. వీరికి అధికార యంత్రంగంతో పాటు ఒకరిద్దరు నాయకులూ కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. అడ్డా దారిన ఒక్కో అక్రిడిటేషన్ కార్డుకు ఒక్కో విలేకరి నుండి సుమారు రూ . 20 నుండి 30 వేల వరకు డబ్బులు తీసుకుని, అక్రిడిటేషన్ కార్డు ఇస్తున్నట్లు ప్రచారముంది. జర్నలిస్టులకు చెందాల్సిన ఇళ్ల స్థలాలు, జెహెచ్ఎస్ హెల్త్ కార్డులు.. అక్రిడిటేషన్లు అన్నీ కాజేస్తున్నారని సమాచారం. హోటల్లో పని చేసేటోల్లకు , సినిమా థీయేటర్లో పని చేసేటోళ్లకు, ఆటో డ్రైవర్లకు, సైకిల్, స్కూటర్ స్టాండుల్లో పని చేసేటోళ్లు, పాలు పోసేటోళ్లు, పేపర్ ఎసెటోల్లు , రాజకీయ నాయకులు, పిఆర్వోలు ఇలా జర్నలిస్టుల పేరిట అక్రిడిటేషన్ కార్డులు పొందిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇదంతా ఒకెత్తు అయితే కొందరు పిఆర్వోలు విఐపిల పలుకుబడితో జర్నలిస్టుల వలె అవతారమెత్తి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఒక జిల్లా డిపిఆర్వో గ్రూప్లో జర్నలిస్టులకు బదులు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విఐపి పిఆర్వోలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం విస్మయాన్ని కల్గిస్తోంది. ఒక జిల్లా డిపిఆర్వో గ్రూప్ నుండి వీఐపీ పిఆర్వోలు, ప్రభుత్వ ఉద్యోగులు, పలు రాజకీయ నాయకులూ, కార్యకర్తలు ఇతరుల పేర్లను తొలగించేందుకు ఎడి స్థాయి అధికారి సైతం సాహసం చేయలేక పోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒక ఐ అండ్ పిఆర్ అధికారి ప్రయత్నం చేసి విఫలమైనారు. సదరు అధికారిపై ఓ పీఆర్వో తన పలుకుబడితో మందలించడంతో సదరు అధికారి మిన్నకుండిపోయినట్లు సమాచారం.