Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
కృష్ణా జలాలు అంటూ బీఆర్ఎస్, మేడిగడ్డ సందర్శన అంటూ కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న డ్రామా : బండి సంజయ్ – K News

కృష్ణా జలాలు అంటూ బీఆర్ఎస్, మేడిగడ్డ సందర్శన అంటూ కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న డ్రామా : బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర నాల్గో రోజు దిగ్విజయంగా పూర్తయింది. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో యాత్ర సాగింది. యాత్రకు అడుగడుగునా జననీరాజనం పట్టారు. వీర్నపల్లి మండలంలో పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. కోనరావుపేట మండలంలో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సంజయ్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ శ్రేణులు సంజయ్ తోపాటు అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్ర చేశారు.

మరోవైపు ప్రజాహిత యాత్రలో ఈరోజు మొత్తం 19 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వివిధ గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి సంజయ్ ఆర్థిక సహాయం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేములవాడ నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. అసెంబ్లీ టైం వృధా చేస్తూ ” కృష్ణాజలాలు అంటూ బీఆర్ఎస్ .. మేడిగడ్డ సందర్శన అంటూ” కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న డ్రామాలను బట్టబయలు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలంటే మరోసారి తనను ఎంపిగా గెలిపించాలని ప్రజలను సంజయ్ అభ్యర్ధించారు.

ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంజయ్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి మహిళలూ, యువత ఇళ్ల ముందు వేచి చూశారు.ఆయన రాగానే కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు. భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్.. అంటూ నినాదాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.