జర్నలిస్టులకు,లాయర్లకు,పోలీసులకు రక్షణ కరువు
అవినీతి సంపాదనకు అలవాటుపడిపోయిన కొంతమంది బడా బాబులు,రాజకీయ నాయకులు,వ్యాపార వేత్తలు తమ ఆగడాలకు అడ్డూ వస్తున్నారనే నెపంతో, నీతి నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను, పోలీసులను,లాయర్లను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తూ,వాళ్ల ప్రాణాలు సైతం తీయడానికి వెనకడుగు వేయడం లేదు అంటే,ఈ దేశం ఎటు పోతుందో ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది..? డబ్బు సంపాదనే లక్ష్యంగా,ధనార్జనే లక్ష్యంగా,అనేక అడ్డదారులు తొక్కుతూ, లక్షల కోట్ల రూపాయ లను కూడా పెట్టుకొని, వాటిని కాపాడు కోవ డానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ,వారి అవినీతిని బయటకు తీసే జర్నలిస్టులను,పోలీసులను,లాయర్లను అతి కిరాతకంగా చంపే స్థాయికి చేరుకున్నారు. అంటే,ఈ దేశంలో గాంధీజి కలలు కన్న స్వరాజ్యం ఎక్కడ ఉంది అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి..
మహాత్మా గాంధీ సిద్ధాంతం ప్రకారం,చెడు వినవద్దు,చెడు చూడవద్దు,చెడు మాట్లాడవద్దు అనే నినాదంతో ఈ దేశ ప్రజలను నీతి, న్యాయంగా బ్రతికే విధంగా తయారుచేసిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలు బుట్టదాఖలు అయిపోయాయి..ఆనాడు బ్రిటిష్ వారి నుంచి ఎంతోమంది త్యాగమూర్తులు ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చి మన అందరినీ ఎంతో సంతోషంగా బతికే విధంగా తీర్చిదిద్దారు.. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మనమే స్వయంపరిపాలన చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత దేశంలో కులాల మధ్య,మతాల మధ్య,వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగిపోయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వలన అంతర్గత యుద్ధం తీవ్రంగా మారింది..కొంతమంది దీనిని అవకాశంగా తీసుకొని, అక్రమ మార్గాల్లో ధనాన్ని సంపాదించు కోవడం మొదలు పెట్టారు.డబ్బు ఉన్నవాడు గొప్పవాడు అని, పేదవాడు తక్కువ వాడు అనే ఆలోచనలో సమాజాన్ని తయారు చేస్తూ,సమాజంలోని ఆర్థిక అసమానతలను పెంపొందింప జేసి, మనుషుల మధ్య గొడవలు సృష్టించి,వాటి ద్వారా లబ్ధి పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు..ఇటువంటి సందర్భాలలో చాలామంది అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు..వీరి అవినీతిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టు లను,పోలీసు వారిని లాయర్లను టార్గెట్ చేసుకొని,వారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం లేకపోతే వారిని చంపడం లాంటి చర్యలను చేస్తూ ఉన్నారు.. చట్టంలో ఉన్న కొన్ని లూపుహోల్స్ ను ఉపయోగించుకొని లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి సునాయాసంగా తప్పించు కోవడం జరుగుతోంది..ఇలాంటి వారికి రాజకీయ అండ దండలు ఎలాగు ఉంటూనే ఉంటాయి.. ఎటొచ్చి నీతి నిజాయితీని నమ్ముకుని పనిచేసే జర్నలిస్టుల, పోలీసుల,లాయర్ల కుటుంబాలు రోడ్డున పడి,నానా ఇబ్బందులు పడడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం..తెలంగాణ రాష్ట్రంలో నడిరోడ్డుపై ఇద్దరు న్యాయవాదులను అమానుషంగా కత్తులతో నరికి చంపడానికి కూడా వెనుకాడలేదు అంటే, దేశంలో క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగిపోయిందో ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి..ఇదే పరిస్థితి దేశంలో కొనసాగితే ఇక నీతికి నిజాయితీకి ఈ దేశం లో స్థానం ఉండదు..ప్రపంచ దేశాలు భారత దేశాన్ని చూసి అసహ్యిం చుకునే పరిస్థితి వస్తుంది..మనిషిని మనిషి చంపుకునే సంస్కృతిని ఒక ఆటవిక చర్యగా చెప్పుకోవచ్చు.. ప్రతి మనిషికి జీవించే హక్కు భగవంతుడు ప్రసాదించాడు,ఆ హక్కులను కాలరాసే వారిని కఠినంగా శిక్షించాలి తప్ప, సులువుగా వదల కూడదు..చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే జర్నలిస్టులకు, పోలీసులకు,న్యాయ వాదులకు రక్షణ లేకపోతే మరి ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది..? ప్రతి ఒక్కరు ఈ విషయంపై ఆలోచన చేయాలి,నీతి కోసం న్యాయం కోసం పోరాడే జర్నలిస్టులకు, పోలీసులకు,న్యాయ వాదులకు ఎటువంటి హాని జరగకుండా ప్రభుత్వ చర్యలు తీసుకునే విధంగా చట్టాలను మార్చాలి..తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతూ, చివరికి రాక్షసుల్లా తయారవుతున్న కొంతమందిని మనం ఆపకపోతే ఈ సమాజం మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంది..కాబట్టి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని, చట్టాన్ని కాపాడే జర్నలిస్టులకు, పోలీసులకు,న్యాయ వాదులకు తగిన భద్రత కల్పించి ఈ సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం..