కరీంనగర్లో కత్తులతో దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో ఆదివారం కత్తులతో దాడి చేసిన సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్ఎండి ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…జనగాం సంపత్ రెడ్డి అనే వ్యక్తి పొదుపు సంఘం ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకుని ఇంటికి వెళ్తుండగా సూరం తిరుపతిరెడ్డి అనే వ్యక్తి వ్యక్తి దుర్భాషలాడాడని దీంతో మాట మాట పెరిగి ఇరువురు దాడి చేసుకున్నారని అన్నారు. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న తిరుపతి రెడ్డి కొడుకులు నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి గొడవ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత మరల తిరుపతి రెడ్డి అతని కొడుకులు సంపత్ రెడ్డి, నరసింహారెడ్డితో గొడవ పడి, నరేందర్ రెడ్డి తన చేతిలో ఉన్న కత్తితో సంపత్ రెడ్డి మెడపై గాయం చేయగా అక్కడే ఉన్న సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపత్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఎ తెలిపారు.