25 కోట్ల కళాకారుల భవనం .. కళాహీనం ..
ఇది హోటల్ కాదు.. కళాకారుల భవనం
కరీంనగర్ జిల్లా కేంద్రంలో 1982లో అప్పటి కలెక్టర్ శర్మ కళాకారులను గుర్తించి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కళాకారుల కోసం వారికి శిక్షణ కళ ప్రదర్శనలు ఇచ్చేందుకు గాను భవనం ఉండాలని ఆలోచన చేసి స్థలమైతే ప్రభుత్వం తరుపున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కానీ భవనం నిర్మించేందుకు కళాకారుల వద్ద డబ్బులు లేవని గుర్తించి అప్పటి కలెక్టర్ శర్మ కళాకారులతో సమావేశం పెట్టి జిల్లా మొట్ట మొదటి సారిగా కన్యాశుల్కం నాటిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ నాటిక ప్రదర్చినకు టిక్కెట్ ద్వారా ఆ కాలంలోనే లక్చలు రూపాయలు ప్రదర్శనకు రావడం తో ఆ డబ్బులతో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన త్యాగ రాజా లలిత కళ పరిషత్ కు భూమిని మంజూరు చేశారు.
దానికి భవన నిర్మాణము కు నిధులు సైతం ప్రదర్సన నుంచి వచ్చిన డబ్బులను కేటాయించారు. చక చక భవన్ నిర్మాణం పూర్తి కావడంతో కళాకారులలో ఆనందం వెల్లువిరిచింది. కొద్ది రోజుల పాటు కళాకారుల శిక్షణ, ప్రదర్శను కళాకారులకు బ్రతుకుకు భరోసా ను ఇచ్చింది ఈ భవనం . కానీ ఈ భవనం ప్రధాన బస్టాండ్ రహదారిని ఆనుకుని ఉండడంతో అధికారంలో ఉన్న నేతల కన్ను పడింది. ఎలాగైన ఈ భవనాన్ని ఆక్రమించాలని దురాభిప్రాయంతో కళాకారుల బాధ్య చిచ్చు పెట్టి అందులో ఆధిపత్యంలో ఉన్న కళకారులను మంచిగా చేసుకుని మీ భవనానికి ఆదాయం వచ్చేటట్లు భరోసా ఇస్తామని కళకారులను మభ్యపెట్టి అప్పుడు అధికారంలో ఉన్న నేతలు సదరు భవనాన్ని లీజుకు తీసుకున్నారు. దీనితో కళాకారుల కౌంట్ డౌన్ మొదలయింది. భావనలో వచ్చిన లీజు దారులు భవనాన్ని పూర్తిగా ఆక్రమిచ్చి కళాకారులు మధ్యలో ఆడ,మగ మధ్య చిచ్చులు పెట్టి కళాకారులను భవనానికి రాకుండా చేశారు. పూర్తిగా భవనాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇగ లీజు దారులు ఆదిందే ఆట.. పాదిందే పాట .. అందులో లాడ్జి పెట్టి చాలా కాలం వ్యభిచారం నడిపించారని ప్రచారం ఉంది.
అందులో భోజనం, మెస్ ఇతర దుకాణాలు వెలిచాయి. ఇదంతా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం ఈ భవనంలో డీఆర్డీఏ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. అది నచ్చని నేతలు, లీజు దారులు అక్కడికి వచ్చి పోయే గ్రామీణ నిరుద్యోగులకు ఇబ్బందులు కల్గించడంతో డిఆర్దోఏ అధికారుకు అందులో నుంచి కలెక్టరేట్ లోకి మార్చుకున్నారు. మల్లి అధికార పలుకుబడితో భవనాన్ని లీజు దారులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఐన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భవనానికి కిరాయిలు ఎటు పోతున్నాయో లెక్కే లేదు. కళాకారుల భవనం లీజుపై కొందరు కళాకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వివరించడంతో దానిని కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోకి అప్పగించారు. నగర పాలక సంస్థ ఈ భవనాన్ని సందర్శించి అప్పుడున్న కార్పొరేషన్ కమిషనర్ కృష్ణ భాస్కర్ లీజు దారులకు నోటీసులు ఇవ్వడంతో, ఆ నోటీసులను అదునుగా తీసుకుని కార్పొరేషన్లపై కోర్టులో లీజు దారులు కేసు వేశారు. ఇలా కళాకారుల భవనం కళకారులకు చెందకుండా ఇతరుల స్వాధీనంలో ఉన్న పట్టించుకోని అధికారులు, నేతలు, కళాకారులు అడిగినప్పుడల్లా ఇదిగో. కొత్త భూమి భవనం అంటూ గతంలో మినీ రవీంద్ర భారతి పేరుతో స్థలం, నిధులు కేటాయించి మధ్యలోనే ఆపివేశారు. ఇది కళాకారులపై ఉన్న ప్రేమ. కొత్తగా బుకో కల సంస్థ మారో కళ సంస్థకు శంకుస్థాపన కూడా చేశారు. నిజంగా కళాకారులపై ప్రేమ ఉంటె కల భారతి కల హీనంగా ఉన్న పట్టించుకునే వారే లేరు. లీజు దారుల కబంధ హస్తాల్లో ఉన్న త్యాగ రాజా కళాభవన్ బాగు చేసి కళాకారులకు ఇవ్వచ్చు కదా .. మినీ రవీంద్ర భారతినిర్మాణం గతే లేదు. కళాకారులపై అధికారులకు , నేతలకు ఉన్న ప్రేమ పై ఓ సీనియర్ కళాకారుడు ఆవేదన వ్యక్తం చేసాడు.