Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
నన్ను గెలికితే.. అంతు చూస్తా.. : బండి సంజయ్ – K News

నన్ను గెలికితే.. అంతు చూస్తా.. : బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ ప్రజాహిత పాదయాత్రను శ్రీ సీతారాముల ఆలయంలోని ప్రత్యేక పూజలు చేసి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రారంభించారు. మహిళలు, యువత భారీ ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారు. బండి సంజయ్ మాట్లాడుతూ..

నా గురించి స్వయం ప్రకటిత అపర మేధావి అవాకులు చవాకులు పేలుతున్నడు. నన్ను గెలకొద్దు.. గెలికితే అంతు చూస్తా. గచ్చిబౌలి లో రూ.500 కోట్ల విలువ చేసే 6 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా మీ వాళ్ల పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్న వో తెలుసు. బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ లో 20 ఎకరాల సింగిల్ బిట్ ను ఎవరి పేరు మీద కొన్నరో తెలుసు. బంజారాహిల్స్ లోటస్ పాండ్ సమీపంలోని విశాలమైన భవంతిలో అధికారులను పిలిపించుకుని సాగిస్తున్న దందాలు తెలుసు. నా జోలికి వస్తే భాగోతమంతా బయటపెట్టాల్సి ఉంటుంది’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయే ప్రమాదముందని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ సంస్థ ఎవరిదో, ఎవరు ఇప్పించారో నాకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఆ సంస్థ పేరును, ఎవరి ద్వారా ఆ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ దక్కిందనే వివరాలు బయటపెట్టాలి’’అని డిమాండ్ చేశారు.అబద్దాలు, మోసాల్లో కేటీఆర్ అయ్యను మించిపోయిండని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సిరిసిల్ల జిల్లాకు రూ.1408 కోట్ల 6 లక్షల నిధులను కేంద్రం ఖర్చు చేసిందని పేర్కొంటూ ఆ వివరాలను వెల్లడించారు. దీంతోపాటు సిరిసిల్ల అసెంబ్లీ, గంభీరావుపేట మండలానికి సంబంధించి ఏయే పనులకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందనే వివరాలను వెల్లడించారు.

హిందువుల 5 వందల సంవత్సరాల చిరకాల వాంఛ అయోధ్యలో రామ మందిర నిర్మాణమని, ఆ కలను నెరవేర్చిన నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్యలోనే రామ మందిరం ఎందుకు కట్టారని వితండ వాదం చేస్తున్న నేతలంతా చరిత్ర తెలుసుకోవాలన్నారు. ఇంకా మాట్లాడితే ప్రజల కోరిక మేరకు దేశంలో అనేక ఆలయాలను నిర్మిస్తామని అన్నారు.

తెలంగాణలో ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం న్యాయమా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ నేతలు తప్పించుకునే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం న్యాయమా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ నేతలు తప్పించుకునే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.