Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
కరీంనగర్ స్మార్ట్ సిటీ దోపిడీ … 100 కోట్లు – K News

కరీంనగర్ స్మార్ట్ సిటీ దోపిడీ … 100 కోట్లు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు పెట్టని కోటగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దోపిడి నిరాటంకంగా కొనసాగుతోంది. అధికార పార్టీ అండదండలతో అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రజాధనం దుర్వినియోగం పాలు చేసినా అడిగే వారే లేకపోవడంతో అక్రమార్కులు ఆడింది ఆట .. పాడింది పాటగా సాగింది. కరీంనగర్ లో కార్పొరేటర్ల ధనదాహం భూ కబ్జాల నేపథ్యంలో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తలు జైలుకు వెళ్ళడంతో వెలుగు చూడగా.. అభివృద్ది పేరుతొ అంతకు వందల రెట్ల మేరకు ప్రజాధనాన్ని స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూస్తున్న సంచలన నిజాలు ప్రభుత్వ పెద్దలను కూడా నివ్వెరపోయేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Municipal Poll: A brief look at Karimnagar's history

నగరాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా కేంద్రం ప్రకటించిన ఈ పథకం కరీంనగర్ నేతలకు కాసులపంటగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ పథకం కూడా పక్కదారి పట్టింది. సానిక ప్రజాప్రతినిధుల అడ్డగోలు దోపిడికి స్మార్ట్ సిటీ పథకం కేంద్ర బిందువుగా నిలిచింది. సుమారు 800 కోట్ల రూపాయల మేరకు స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అభిమృద్ది పనులు జరగగా… దాదాపు 100 కోట్ల రూపాయలు పర్సంటేజీల రూపంలోనే స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఒకవైపు అభివృద్ది జరుగుతుండగా.. దానితో పాటుగా దోపిడి కూడా కొనసాగడం గమనార్హం. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కెన తీరు ఇప్పుడు కరీంనగర్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ఈ పథకం కింద ఖర్చు చేసే నిధులను రాష్ట్రం, కేంద్రం చెరి సగం భరించాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా చెరో 500 కోట్ల రూపాయలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించాల్సి ఉంటుంది. కానీ నిజానికి ఈ పథకం కింద ఇప్పటి వరకు 790 కోట్ల రూపాయల మేరకు పనులు జరగగా… అందులో దాదాపు 500 కోట్ల రూపాయల పైచిలుకు కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధుల మంజూరీ కోసం ఎన్ని సార్లు ప్రతిపా దనలు పంపిన బల్దియాకు చేరిందేమీ లేదని చెబుతున్నారు. దాదాపు మరో 200 కోట్ల పైచిలుకు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ పథకం మంజూరీని బీఆర్ఎస్ పార్టీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ది పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా.. నిధుల వరకు వచ్చే సరికి మొండిచేయి చూపిందనే విమర్శలు ఉన్నాయి.

Traffic junctions to get new look in Karimnagar-Telangana Today

స్మార్ట్ సిటీ పథకం అమలు కోసం మొదట్లో ప్రత్యేక విభాగాన్ని నియమించాలని భావించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని షరా మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ కే అప్పగించారు. మాములు పనుల విషయంలోనే వీలైన మేరకు చేతివాటం ప్రదర్శించే ప్రజాప్రతి నిధులు, మున్సిపల్ అధికారులు వందల కోట్ల నిధులు వరదలా వచ్చి పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు. నిధులు విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకోవడంతో అధికారుల అండతో ప్రజాప్రతినిధులు చెలరేగిపోయారు. పైన పెద్దల అంఢ కూడా సంపూర్ణంగా ఉండటంతో ఏ మాత్రం సమయం వృధా చేయకుండా అడ్డగోలు ఆదాయంపై దృష్టి సారించారని తెలుస్తోంది.

Karimnagar | Smartcities
అంతేకాకుండా మున్సిపల్ వ్యవహారాల్లో రాటుదేలిన పాలకులకు అక్రమ సంపాదనను రాచమార్గంగా మార్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మొదట్లో తయారైన అంచనాలను రాత్రికి రాత్రి సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించేలా చూసుకోవడం ద్వారా తమకు అదనపు లాభం విపరీతంగా పెరిగేలా చూసుకో వడమే లక్ష్యంగా ఇటు పాలకులు, అటు అధికారులు పరస్పరం తమ వంతు సహకారం అందించుకొని లబ్ది పొందారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి చిన్నగా ఉన్నా కూడా ఇప్పటికే 800 కోట్ల రూపాయల మేరకు అభివృద్ది పనులు జరిగాయని చెబుతుండటం వెనుక అసలు కథ అంచనాలు సవరించడమేనని తెలుస్తోంది. 50 లక్షల రూపాయలతో పూర్తి చేయాల్సిన పనులకు కనీసం కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకైనా అంచనాలను సవరించకపోతే అందిరి అంచనాలకు అనుగుణంగా పర్సంటేజీలు ఇవ్వడం కుదరదంటూ కాంట్రాక్ట్ సంస్థ తెగేసి చెప్పడంతో ఆ ప్రకారంగానే పావులు కదిపారు. గతంలో ఇక్కడ పని చేసిన ఒక ఇంజనీరింగ్ అధికారి చక్రం తిప్పి మొత్తం అంచనాలను దగ్గరుండి సవరించడంతో పాటు వాటాల పంపకంలోనూ తేడాలు రాకుండా చూసుకోవడంతో ఆయన ఉన్నంతకాలం బల్దియాలో ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిందని చెబుతున్నారు.

Smart City Karimnagar || Siri videos & fashions|| - YouTube

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన, జరుగుతున్న అక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీససుకువెళ్ళారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇంటలిజెన్స్ అధికారుల ద్వారా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద జరిగిన పనుల్లో అవకతవకల తీరుపై సమగ్ర నివేదికను కోరారని సమాచారం. ఈ మేరకు వివిధ మారాల నుంచి .. పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఈ పథకం అమలు తీరుపై సర్కారుకు సమాచారం అందిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకం కింద 100 కోట్ల రూపాయలను పర్సంటేజీల రూపంలో స్వాహా చేశారని తేల్చిచెప్పడం వెనుక ఖచ్చితమైన ఆధారాలు ఉండటం వల్లే మంత్రిగా పొన్నం ఈ రకంగా వ్యాఖ్యానించి ఉంటారని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.