Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
తిరుపతి జూ పార్కులో వ్యక్తిని చంపేసిన సింహం.. – K News

తిరుపతి జూ పార్కులో వ్యక్తిని చంపేసిన సింహం..

తిరుపతిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో ఓ వ్యక్తి సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రమాదవశాత్తూ బాధితుడు లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లటంతో.. తనపై సింహం దాడిచేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

lion attack

తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర జూపార్కు ఆసియాలోనే అతి పెద్ద జూపార్కుగా గుర్తింపు పొందింది. సుమారు 1,250 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూపార్కు విస్తరించింది. ఇందులో వందల రకాల జంతువులు, పక్షులు, సర్పాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు.. స్వామివారి పాదాల వద్ద కొలువైన జూపార్కును కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గురువారం కూడా కొంతమంది పర్యాటకులు శ్రీ వెంకటేశ్వర జూపార్కు సందర్శనకు వెళ్లారు. అయితే వారిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ అనుకోకుండా లయన్ ఎన్‌క్లోజర్‍‌లోకి ప్రవేశించాడు. దీంతో అతనిపై సింహం దాడి చేసినట్లు తెలిసింది.

అయితే జూపార్కులో జరిగిన ఈ ఘటనతో మిగతా పర్యాటకులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇక బాధితుడి తాలూకూ వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.