Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
తీర్మానం కాదు.. BC కులగణన చట్టం చేయాలి: మాజీ మంత్రి గంగుల డిమాండ్ – K News

తీర్మానం కాదు.. BC కులగణన చట్టం చేయాలి: మాజీ మంత్రి గంగుల డిమాండ్

బీసీ కులగణనకు తీర్మానం చేస్తే చట్టబద్దత ఉండదని, చట్టం చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శుక్రవారం బీసీ కులగణన తీర్మానంపై జరిగిన చర్చపై మాట్లాడారు.

సర్వే బీసీ కమిషన్ చేస్తుందా..? ప్రభుత్వం చేస్తుందా..? ప్రత్యేక కమిషన్ ద్వారా చేస్తారా..? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా, ఆర్ధికంగా, ఉద్యోగపరంగా నష్టపోయింది వెనుకబడి కులాలే అన్నారు. నిర్ణీత గడువు ఏమైనా నిర్ణయించారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌లో సర్వేకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టం చేయలేదని అన్నారు. 77 ఏళ్లుగా రాజ్యాధికారం కోసం బీసీలు కొట్లాడుతున్నారని, కేంద్రానికి తీర్మానం చేసి పంపించాలని కోరారు.

తీర్మానం కాదు.. BC కులగణన చట్టం చేయాలి: మాజీ మంత్రి గంగుల డిమాండ్

కర్నాటక, బీహార్‌లో బీసీ కులగణనకు అడ్డంకులు ఎదురయ్యాయని.. అలాంటివి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారని, అమలు దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఐదేళ్లలో బీసీలకు లక్ష కోట్లు కేటాయిస్తామని 8 వేలకోట్లు మాత్రమే పెట్టారని అన్నారు. ఎంబీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైన్స్‌లల్లో 25శాతం బీసీలకు కేటాయిస్తామన్నారని అమలు చేయాలని, ప్రతిజిల్లా కేంద్రంలో ఐక్యతా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణనపై సభలో మాట్లాడనివ్వలేదని, ఇది కేవలం పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్దిపొందడానికేనని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.