Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
చట్టం కన్నా చిత్తశుద్ధి ముఖ్యం: మంత్రి పొన్నం ప్రభాకర్ – K News

చట్టం కన్నా చిత్తశుద్ధి ముఖ్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ కులగణనకు చట్టం కన్న చిత్తశుద్ధి ముఖ్యమని, అది తమ ప్రభుత్వానికి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ కులగణన తీర్మానంపై ఆయన శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు.

కులగణన విధి విధానాలకు సంబంధించి అందరి సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. వివక్ష పూరితంగా.. రాజకీయంగా తీసుకోబోమన్నారు. బలహీన వర్గాల కోసమే తమ లక్ష్యం అన్నారు. ఎవరూ అనుమానం పడొద్దు అని సూచించారు.

చట్టం కన్నా చిత్తశుద్ధి ముఖ్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

గత ప్రభుత్వం చేసిన కుటుంబ సర్వేను బయటపెట్టాలని, ప్రజాధనంతో చేసిందన్నారు. ఆత్మగౌరవ భవనాలకు రూపాయి ఇవ్వలేదు. బీసీ బంధుకు రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కుల ఫెడరేషన్ ఉన్నాయని వాటికీ నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు. ఎంబీసీలకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించి ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు.

2014-23 వరకు గత ప్రభుత్వం బీసీ సంక్షేమానికి 23 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని, తాము ఈ బడ్జెట్‌లోనే 8 వేలకోట్లు కేటాయించామన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా, సాంకేతికంగా కులగణను తీసుకుంటామన్నారు. పారదర్శకంగా కులగణనపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా సూచనలు ఇవ్వాలన్నారు. రాజకీయ పరమైన విమర్శలు చేయవద్దని సూచించారు.

కేంద్రం బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పీఎంను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సమగ్ర కుల గణన చేపట్టిందన్నారు. చారిత్రాత్మక సమగ్ర కులగణన తీర్మానంపై అన్ని పార్టీలు ఆమోదం పొందడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కుల గణన తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంపై ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.