మీరు క్రికెట్ ఎక్స్‌పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
మెల్‌బోర్న్: మీరు క్రికెట్ ఎక్స్‌పర్టా.. చాలా రోజులుగా క్రికెట్ చూస్తున్నారా? గేమ్ గురించి మీకు మొత్తం తెలుసని అనుకుంటున్నారా? అయితే కింద ఉన్న వీడియో చూసి ఇది అవుటా కాదా చెప్పండి. అంపైర్లు మాత్రం దీనిని అవుట్‌గా ప్రకటించారు. ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్, క్వీన్స్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విచిత్రమైన క్యాచ్ ఇప్పుడు ట్విటర్‌లో చర్చకు తెరలేపింది. దీనిని ఎలా అవుట్ ఇస్తారంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
క్వీన్స్‌లాండ్ ఫీల్డర్ మార్నస్ లబుషేన్ క్యాచ్ పట్టుకున్నాడు. అయితే తనను తాను నియంత్రించుకునే లోపే బంతి కాస్తా చేతిలో నుంచి కింద పడిపోయింది. కానీ అంపైర్లు మాత్రం దీనిని అవుట్‌గా ప్రకటించారు. క్రికెట్ నిబంధనల ప్రకారం క్యాచ్ పట్టుకున్న తర్వాత ఫీల్డర్ తన శరీరంపై, బంతిపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం లబుషేన్ బంతిని మధ్యలోనే వదిలేశాడు. ఒకవేళ ఇది అవుట్ అయితే 1999 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ వా ఇచ్చిన క్యాచ్‌ను సౌతాఫ్రికా ఫీల్డర్ గిబ్స్ అందుకోవడం కూడా కరెక్టే అవుతుందని నెటిజన్లు వాదిస్తున్నారు. దీనిని అవుట్‌గా ఇవ్వడం ద్వారా అంపైర్లు గిబ్స్‌ను ట్రోల్ చేస్తున్నారనీ కొందరు కామెంట్ చేశారు.
A 'peculiar' ending to the NSW innings, with this deemed to be a legal catch #SheffieldShield pic.twitter.com/T4gQgr1Rc2
— cricket.com.au (@cricketcomau) April 4, 2021