Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
ఏం చేసినా అవి హైలెట్ చేయరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ – K News

ఏం చేసినా అవి హైలెట్ చేయరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) ఒకరు. ఈమె బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు.

ఇలా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించినటువంటి ఈమెకు జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కూడా యాంకర్ గా చేసే అవకాశం లభించింది. ఈ కార్యక్రమంతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. జబర్దస్త్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ అనంతరం మెల్లమెల్లగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా అనసూయ బిజీ అయ్యారు.

  దీంతో ఒక వైపు వెళ్లి తెరపైన మరోవైపు బుల్లితెర పైన కొనసాగడానికి ఎంతో ఇబ్బందిగా మారడంతోనే ఆమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి అనసూయ కేవలం సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

ఇక ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ( Social Media )లేదా మీడియా సమావేశంలోనైనా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.   ఈ క్రమంలోనే అనసూయలో భక్తి భావం కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఈమె తనకు వీలైనప్పుడల్లా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంట్లో పూజలు వ్రతాలు హోమాలు కూడా చేస్తూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల తాను ఆంజనేయ స్వామి భక్తురాలు అనే విషయాన్ని కూడా అనసూయ వెల్లడించారు.ఆంజనేయస్వామి భక్తురాలు కావడంతో తన కుమారుడికి అదే పేరు పెట్టానని తెలియజేశారు. ఇందులో ఉండగా తాజాగా అనసూయ నారింజ రంగు చీర కట్టుకొని ఆంజనేయస్వామి ( Anjaneya Swamy ) ఆలయాన్ని దర్శించుకున్నారు ఇలా ఎంతో పద్ధతిగా సాంప్రదాయ దుస్తులలో ఈమె ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వచ్చారు. ఇకపోతే స్వామివారి దర్శనం అనంతరం అనసూయ మీడియా సమావేశంలో మాట్లాడారు.  తాను తరచూ గుడికి వెళ్తాను ఎప్పుడు ఇంట్లో కూడా పూజలు చేస్తాను హోమాలు చేస్తాను కానీ సోషల్ మీడియాలో ఇలాంటివి మాత్రం హైలెట్ కావు కానీ ఏవేవో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే నేను గుడికి వెళుతున్నానని అందరితో చెప్పుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదు అంటూ అనసూయ ఈ సందర్భంగా చెప్పడంతో ఈమె మాటలకు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా షాక్ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.