Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
గంజాయి కేసులో షణ్ముఖ్ అరెస్ట్ – K News

గంజాయి కేసులో షణ్ముఖ్ అరెస్ట్

రు రోజుల్లో పెళ్లి…! పెళ్లి పనులు పూర్తయ్యాయి.. వెడ్డింగ్ కార్డుల పంపకాలూ అయ్యాయి..! అంతలోనే షాక్..! కాబోయే వరుడు.. అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు..

ఇదేంటని అడిగితే తన్ని తరిమేశాడు. దిక్కులేక పోలీసులను ఆశ్రయించింది యువతి. మోసగాడి కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులకు మరో షాక్..! డ్రగ్స్, గంజాయితో పట్టుబడ్డాడు ఆ మోసగాడి అన్న. అతడేవరో కాదు.. బిగ్ బాస్ ఫేమ్.. యూట్యూబ్ స్టార్ షణ్ముక్. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉన్న ప్రేమ కథా చిత్రమ్

పదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ అనుకున్నారు. లైఫ్ లాంగ్.. ఇంతే ప్రేమ గా ఉండాలి అనుకుని ఒకటవుదాం అనుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి కి సిద్ధమయ్యారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట.. ఆరు రోజులైతే ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యేది. పెళ్లి ఫిబ్రవరి 28న జరగాల్సి ఉంది. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. వెడ్డింగ్ కార్డుల పంపకాలూ పూర్తయ్యాయి. అంతలోపు పెళ్లి కూతురికి షాక్.. ! తనకు కాబోయే వరుడికి అప్పటికే పెళ్లి అయ్యిందని, కాపురం కూడా పెట్టాడని తెలుసుకుంది. నిజం కాకపోవచ్చు అని ప్రియుడి ఇంటికి వెళ్ళి చూసింది. నిజమేనని తెలుసుకుంది. నమ్మించి గొంతుకోసిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.

Shanmukh: అరే ఏంట్రా ఇది.. మరో వివాదంలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్

యువతిని మోసం చేసిన వ్యక్తి పేరు వినయ్ సంపత్. షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తున్నాడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని.. వినయ్ సంపత్ కోసం ఫ్లాట్ వెళ్ళారు పోలీసులు. సంపత్ ఫ్లాట్‌లో సంపత్ అన్న షణ్ముక్ కనిపించాడు. షణ్ముక్ బిగ్ బాస్ ఫేం…! షార్ట్ ఫిల్మ్ తో చాలా ఫేమస్. స్మాల్ స్క్రీన్ సూపర్ స్టార్ గా కూడా షణ్ముక్ కి పేరు. ఫ్లాట్ లో పోలీసులు తనిఖీ చేయగా, మరో షాక్ ఎదురైంది. ఫ్లాట్ లో గంజాయి తో పాటు కొన్ని మత్తు పదార్థాలు లభించాయి. షణ్ముక్ ను అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు.. సంపత్ ఆచూకీ కనిపెట్టారు. అన్నాతమ్ముడు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

సంపత్ పై యువతి ఫిర్యాదు మేరకు అత్యాచారం, చీటింగ్ కేసులు నమోదు చేశారు పోలీసలుు. అయితే… ఫ్లాట్ లో లభించిన మత్తు పదార్థాల పై విచారణ ఇంకా కొనసాగుతోంది. అవి షణ్ముక్ వా… సంపత్ వా అనేవి పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు వృత్తి రీత్యా డాక్టర్ అయినప్పటికీ, తనకు యాక్టింగ్ అంటే ఇష్టం. తాను రీల్స్, వీడియోలు చేసి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసేది. అలా.. సోషల్ మీడియా ద్వారాషణ్ముక్ పరిచయం అయ్యడు. షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇప్పిస్తానని యువతిని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా, ఎలాంటి అవకాశాలు లేవు. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అని అడిగింది యువతి. దీంతో.. షణ్ముక్.. తన అన్న సంపత్ కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాడని, యువతికి సంపత్ ను పరిచయం చేశాడు షణ్ముక్.

తమ్ముడు షణ్ముక్ ద్వారా పరిచయం అయిన యువతితో స్నేహంగా మెలిగాడు సంపత్. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమ గా మారింది. అవకాశం చూసుకుని ఒకసారి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు సంపత్. దీంతో యువతి సంపత్ ను నిలదీసింది. ఎక్కడ విషయం బయటపడుతుందో అని భయపడిన సంపత్, యువతికి రింగ్ ఇచ్చి, ఇదే మన ఎంగేజ్మెంట్ అనుకోమని, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. ఎలాగో కాబోయే భర్త కదా అని యువతి సంపత్ తో మరింత సన్నిహితంగా మెలిగింది.

అలా పలుమార్లు యువతి ని శారీరకంగా వాడుకున్నాడు సంపత్. ఒకసారి బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది యువతి. అబార్షన్ చేయించిన విషయాన్ని సంపత్ పేరెంట్స్‌కి చెప్పింది యువతి. అబార్షన్ అయిన విషయాన్ని బయటకు చెప్పవద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారు సంపత్ పేరెంట్స్. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. ఫిజికల్‌గా కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

ఇంతలో యువతితో సంపత్‌కి పెళ్లి ఫిక్స్ చేశారు రెండు కుటుంబాల వాళ్ళు. మూడేళ్ల క్రితం వైజాగ్‌లో అట్టహాసంగా ఎంగేజ్మెంట్ చేశారు. అయితే, యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. అలా మూడేళ్లు గడిచింది. తల్లి ఆరోగ్యం కుదుటపడటంతో పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 28న ఇద్దరి వివాహం నిశ్చయించారు పెద్దలు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనులు పూర్తి చేసుకున్నారు. పెళ్లి కార్డులు కూడా బంధువులు, సన్నిహితులకు పంచారు. పెళ్లి మాత్రమే మిగిలింది. అంతలోపే పెద్ద షాక్..! సంపత్ అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడని తెలుసుకుంది యువతి.

నమ్మి మోసపోయాను అని గ్రహించిన యువతి.. నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. సంపత్‌పై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ కోసం నానక్‌రాంగూడలోని సంపత్ ఫ్లాట్ కి వెళ్ళారు పోలీసులు. అక్కడ సంపత్ తమ్ముడు షణ్ముక్ ఉండటంతో.. ఫ్లాట్ లో సంపత్ కోసం గాలించారు పోలీసులు. తీరా చూస్తే, అక్కడ మరో షాక్! ఫ్లాట్ లో గంజాయి తో పాటు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఫ్లాట్‌లో తనిఖీల కోసం వచ్చిన కానిస్టేబుల్‌లో ఒకరైన జావేద్… తనను ఫ్లాట్ బయటకు వెళ్ళిపొమ్మని చెప్పాడని, బలవంతంగా అక్కడ ఉండకుండా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది యువతి. డ్రగ్స్ చూడగానే మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని చెప్పమని, కాంప్రమైజ్ అవమని కానిస్టేబుల్ జావేద్ ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తోంది యువతి. డ్రగ్స్‌కి సంబంధించిన వీడియో ప్రూఫ్ కూడా తన దగ్గర ఉందని అంటోంది. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు న్యాయం కావాలని కోరుతోంది యువతి. షణ్ముక్, సంపత్ తోపాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తనను మోసం చేసిందని ఫిర్యాదు చేసింది యువతి.

యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన సంపత్ పై అత్యాచారం కేసు, చీటింగ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే… ఫ్లాట్ లో దొరికిన గంజాయి, మత్తు పదార్థాలు ఎవరివి..? షణ్ముక్, సంపత్ లో ఎవరు వాటిని వినియోగిస్తున్నారు. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చాయి.. అనేది ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది అంటున్నారు నార్సింగ్ పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.